Durga Puja: 'దుర్గాపూజ.. అత్యంత సెక్యులర్ ఫెస్టివల్'

by Vinod kumar |
Durga Puja: దుర్గాపూజ.. అత్యంత సెక్యులర్ ఫెస్టివల్
X

కోల్‌కతా: దుర్గాపూజ అనేది అత్యంత సెక్యులర్ ఫెస్టివల్స్‌లో ఒకటని.. అది పూర్తిగా మతపరమైన పండుగ కానే కాదని కోల్ కతా హైకోర్టు పేర్కొంది. కోల్ కతా సిటీలో నిత్యం ఎగ్జిబిషన్స్ నిర్వహించే పబ్లిక్ గ్రౌండ్‌లో దుర్గాపూజ కు సంబంధించిన వేడుకలను నిర్వహించు కునేందుకు ఓ సంస్థకు అనుమతిని నిరాకరించిన అధికారులకు కోర్టు మొట్టికాయలు వేసింది. అదే గ్రౌండ్ లో దుర్గాపూజ వేడుకలను నిర్వహించుకునేందుకు అనుమతిని మంజూరు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య ఆదేశించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. పబ్లిక్ పార్కులు, రోడ్లు, ఫుట్ పాత్‌లలో పూజలు చేసే హక్కు పిటిషనర్లకు లేదన్న అధికారుల వాదనను కోర్టు తోసిపుచ్చింది. తరుచుగా మేళాలు జరిగే పబ్లిక్ గ్రౌండ్‌లో సెక్యులర్ ఫెస్టివల్ అయిన దుర్గా పూజను నిర్వహించుకుంటే తప్పేమిటని అధికారులను ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం వల్ల స్థానిక పోలీసులపై పనిభారం పెరుగుతుందనే వాదన సరికాదని న్యాయస్థానం తెలిపింది.

Advertisement

Next Story