- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించొద్దు: కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందన
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ తమను ఆర్థికంగా కుంగదీస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించొద్దని తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పేవన్ని అబద్దాలేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఎంత తక్కువ మాట్లాడితే కాంగ్రెస్ అంత ఎక్కువ లాభపడుతుందని సూచించారు. అలాగే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ అగ్ర నాయకత్వం మీడియా నిర్వహించింది. వారి అసంబద్ధతను గుర్తించుకోలేక ఆర్థిక పరిస్థితిపై నిందలు వేస్తున్నారు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ తమ తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రతీ రంగాన్ని దోచుకున్న పార్టీ ఆర్థిక ఇబ్బందులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. కుంభకోణాల ద్వారా కూడబెట్టిన డబ్బును ఎన్నికల ఖర్చుకోసం ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.