- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బంగారం ధరలపై డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా పతనం
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్(Trump) సంపూర్ణ విజయం సాధించి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో బుధవారం రోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. అలాగే భారత దేశీయ మార్కెట్ నిఫ్టీ(Nifty) కూడా భారీ లాభాలతో ముగిసింది. ఇదిలా ఉంటే అమెరికాలో ట్రంప్ గెలవడం బంగారం ధరల(. Gold prices)పై కూడా తీవ్ర ప్రభావం పడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం భారీగా పెరిగిన ధరలు గురువారం ఒక్కసారిగా తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 1,650 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 తులం బంగారంపై ఏకంగా 1790 రూపాయలు తగ్గింది. ఇదిలా ఉంటే వెండి(silver) ధర ఎన్నడు లేనంతగా ఒక్కసారి రూ. 3 వేలు తగ్గింది. దీంతో హైదరాబాద్(Hyderabad)లో కిలో వెండి ధర రూ.1,02,000గా ఉంది. అలాగే నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72 వేలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,560 గా ఉంది. సరిగ్గా పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలు దారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు షాపులకు క్యూ కడుతున్నారు.