- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YS Sharmila : వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ వర్రా రవీందర్ రెడ్డి అరెస్టుపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media) ఇంఛార్జ్ వర్రా రవీందర్ రెడ్డి(Warra Ravinder Reddy) అరెస్టుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన కామెంట్స్ చేశారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నానని వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. సమాజానికి మంచి చేసే సోషల్ మీడియాను సైకోలు, సైకో పార్టీలు భ్రష్టు పట్టించారని విమర్శించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా మారారని మండిపడ్డారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా, ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళ అనే ఇంగితం లేకుండా .. అసభ్యకర పోస్టులు పెట్టి రాక్షస ఆనందం పొందారని ఆగ్రహం వెళ్లగక్కారు. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
అటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత సైతం వర్రా అరెస్టును సమర్థించుకున్నారు. ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీనికోసం అవసరమైన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధికారం పోయాక వైసీపీ నేతలు అభివృద్ధికి ఆటంకం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. మానసికంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి అనిత, ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ బిడ్డలపైనా ఇష్టారీతిన పోస్టులు పెట్టారని.. అలాంటి వారిని వదిలిపెట్టాలా? అని ప్రశ్నించారు. బాంబులకు కూడా భయపడలేదని.. కానీ తన గురించి అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. కొవ్వు ఎక్కువై నేరస్థులుగా తయారవుతున్నారని తీవ్ర స్వరంతో సీఎం. వ్యాఖ్యానించారు. ఆ కొవ్వును కరిగిస్తామన్నారు.
Read More..
‘ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావ్?’.. వైఎస్ జగన్ పై హోంమంత్రి సెన్సేషనల్ కామెంట్స్