ఉప్పు నీటితో ఊహించలేని బెన్‌ఫిట్స్..!

by Kanadam.Hamsa lekha |
ఉప్పు నీటితో ఊహించలేని బెన్‌ఫిట్స్..!
X

దిశ, ఫీచర్స్: టైటిల్ చూసి, ఉప్పు నీటితో బెన్‌ఫిట్స్ ఏమున్నాయని అనుకుంటున్నారు. ఈ నీటి వల్ల చాలా లాభాలే ఉన్నాయి. ఉప్పులో ఎక్కువగా అయోడిన్ ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఉప్పులో ఉండే అయోడిన్ మెదడుకు, థైరాయిడ్ గ్రంథికి మేలు చేస్తుంది. వేడి వాతావరణంలో ఉండేవారికి, అతిగా చెమటలు పట్టేవారికి ఈ ఉప్పు నీరు ఉపయోగపడుతుంది. అలసట, నీరసంగా అనిపిస్తున్నా అందుకు కారణం అయోడిన్ లేకపోవడమే. కొందరు ఉప్పును ఎక్కువగా తింటారు. అలా తినడం వల్ల రక్తపోటు వచ్చే చాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాల్ట్ శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను సులువుగా పునరుద్ధరిస్తుంది.

ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ ఉప్పు కలిపిన నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, రక్తపోటు సమస్య ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఎండలో పనిచేసే వారికి ఈ సాల్ట్ వాటర్ మేలు చేస్తుంది. ఎందుకంటే, వీరికి బాడీలో ఉన్న నీటి శాతం, చెమట రూపంలో ఎక్కువగా పోతుంది. దీని వలన శరీరంలో ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి. అందువల్ల వీరు సాల్ట్ వాటర్ తాగడం వల్ల బాడీ బ్యాలెన్స్ అవుతుంది. గొంతు నొప్పి, గొంతు మంటతో బాధపడేవారు సాల్ట్ వాటర్‌ను పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాని తొలగించడానికి సహాయపడుతుంది.

అంతేకాకుండా కడుపులోని జీర్ణరసాలు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఉప్పు నీటి కారణంగా పేగుల్లోకి అదనంగా నీరు చేరి మలవిసర్జనకు ఆస్కారం ఏర్పడుతుంది. జీర్ణాశయంలో ఎంజైమ్స్ ఉత్పత్తికి ఉప్పు నీరు సహాయపడుతుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు కలపడం వల్ల చర్మం పీహెచ్ బ్యాలెన్స్ బాగుంటుంది. దీని వల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా కండరాలు రిలాక్స్ అవుతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed