విద్యార్థులతో సమగ్ర సర్వే…ఉపాధ్యాయురాలు వివరణ.!

by Kalyani |
విద్యార్థులతో సమగ్ర సర్వే…ఉపాధ్యాయురాలు వివరణ.!
X

దిశ, మరిపెడ : ఈనెల 6 తేదీ నుంచి ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు ఒంటిపూట ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు నడుస్తున్నాయి. ఎన్యుమరేటర్ లకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని కూడా అందించనుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వేలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో ఇళ్లకు కుటుంబ సర్వే స్టిక్కర్స్ అంటిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం పట్ల అ ఉపాధ్యాయురాల్ని వివరణ కోరగా విద్యార్థులే తనకు ఆరోగ్యం బాగుండదని తెలిసి అప్పుడెక్కడికి వచ్చారని తెలిపారు. తాను అనారోగ్య బాధితురాలని కళ్ళు తిరిగి పడిపోతుంటానని, ఉన్నతాధికారులకు చెప్పుకోలేక తప్పని పరిస్థితుల్లో సర్వేలో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చారు.

జిల్లా లో సర్వే నిర్వహించిన చాలా ప్రాంతాల్లో విద్యార్థులతో ఉపాధ్యాయులు లంచ్ బాక్స్,హ్యాండ్ బ్యాగులను మోసుకొని వెంట తిప్పుకున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

Advertisement

Next Story