‘ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావ్?’.. వైఎస్ జగన్ పై హోంమంత్రి సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |   ( Updated:2024-11-07 12:54:24.0  )
‘ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావ్?’.. వైఎస్ జగన్ పై హోంమంత్రి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ పాలన పై రాష్ట్ర హోం మంత్రి అనిత(Home Minister Anita) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాజాగా హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ(YSRCP) పాలనలో అనేక మంది మాన ప్రాణాలు పోతుంటే పట్టించుకోని జగన్(YS Jagan) ఇప్పుడు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి అనిత ప్రశ్నించారు. గత వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలోనే డ్రగ్స్, గంజాయి వాడకం పెరిగిందన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) రోజునే వైసీపీ పాలనలో యువతిని హత్య చేశారని గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెడుతుందని చెప్పారు. ఈ క్రమంలో మరోసారి గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అత్యాచారాంధ్ర ప్రదేశ్‌గా మార్చిందని హోం మంత్రి అనిత దుయ్యబట్టారు. ఐదు నెలల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ హయాంలో ఏమి జరిగిందో ప్రజలు మర్చిపోలేరని చెప్పారు. తాము చేసిన తప్పులతోనే 11 సీట్లు వచ్చాయని నిన్న మాజీ మంత్రి అన్నారని హోం మంత్రి అనిత గుర్తు చేశారు.


Read More..

Home Minister:డిప్యూటీ సీఎం పవన్‌తో హోం మంత్రి అనిత భేటీ.. కారణం ఏంటంటే?

Advertisement

Next Story