- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ నగరాన్ని రాష్ట్రానికి రెండో రాజధానిగా తీర్చిదిద్దుతాం : మంత్రి పొంగులేటి
దిశ, తొర్రూర్: వరంగల్ నగరాన్ని రాష్ట్రానికి రెండో రాజధానిగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని, ఇందుకు తగిన కార్యాచరణను రూపొందిస్తున్నట్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో స్థానిక వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి, ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన.. వరంగల్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ జిల్లాలో పర్యటించిన పొంగులేటి మరోసారి వరంగల్ ను రెండో రాజధానిగా చేస్తామని ప్రస్తావించడంతో ఈ అంశం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్గా మారింది. అదేవిధంగా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన అనుమానుల తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ బట్టు నాయక్, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా..రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...“ఏడు లక్షల పంతొమ్మిది కోట్లు అప్పు ఉన్న రైతు సంక్షేమం కోసమే కృషి చేస్తున్నాం. ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు సర్వీసు అందిస్తున్నాం. పదేళ్లలో చేసిన అప్పుకు వడ్డీ చెల్లిస్తూ అభివృద్ధి చేస్తుంటే బదనాం చేస్తున్నారు. గుడ్డ కాల్చి మీద వేసే పనిలో బావ బామ్మర్దులు ఉన్నారు. తాము చేసిన సర్వేల్లో 6వెయిల ఎకరాల భూమిలో 2100 ఎకరాల భూమికి పింక్ బినామీలకే ఉంది,దానికి కొన్ని లక్షల రూపాయలు రైతు బంధు అక్రమం చేశారు.
అదేవిధంగా నెల రోజుల్లో స్మార్ట్ కార్డు అదే ప్రభుత్వ పథకాలకు అర్హత కార్డు, రేషన్ కార్డు పెన్షన్ కార్డ్ ఆధార్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డు హెల్త్ ఐడి కార్డ్ అన్నింటికీ ఒకటే కార్డ్ స్మార్ట్ కార్డ్. అదేవిధంగా 1,52,000 టెండర్లు పిలిచి 82,000 ఇండ్లు పూర్తి, మొండి గోడలతో దర్శనం ఇది కేసీఆర్ పాలనకు నిదర్శనం ఇదే నా డబుల్ బెడ్ రూమ్ పథకం. రైతు సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం నెల రోజుల్లో పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేశాం. ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటున్నాం.ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు తీసివేయం. ఇచ్చిన హామీలకు కట్టుబడి అహర్నిశలు కృషి చేస్తున్నాం.అన్ని వర్గాలకు అండగా ఉంటూ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీపావళి తర్వాత బాంబులకు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు.గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకున్నట్టు ఉంది.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..“గత ప్రభుత్వంలో పాలకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి శూన్యం గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పాలకుర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. త్వరలో కూడా నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు రానున్నాయి. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద మున్సిపాలిటీగా ఉన్న తొర్రూరు పట్టణానికి మరో 20 కోట్లు రూపాయలు మంజూరు చేసి నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికల అప్పుడు మీరు ఎంతో కష్టపడి పని చేశారు అందుకే మేము గెలుపొందాము.
ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్న కారణంగా మేము కష్టపడి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని గెలిపిస్తాం. పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంగా పనిచేసే ప్రజల మనలను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి,కడియం కావ్య, పార్లమెంట్ సభ్యురాలు- వరంగల్,పోరిక బలరాం నాయక్,పార్లమెంట్ సభ్యులు - మహబూబాబాద్,డాక్టర్. జాటోత్ రామచంద్ర నాయక్,శాసన సభ్యులు & ప్రభుత్వ విప్ డోర్నకల్,భూక్యా మురళి ముద నాయక్, శాసన సభ్యులు- మహబూబాబాద్, సిరిసిల్ల రాజయ్య.రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్-మహబూబాబాద్,శ్రీభరత్ చందర్ రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ మహబూబాబాద్,హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.