- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Balmuri Venkat : ఫార్ములా రేస్‌పై మాట్లాడిన కేటీఆర్.. డ్రగ్స్‌పై ఎందుకు స్పందించడం లేదు!
దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్ ఆరోపణలపై (KTR) కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్‌లో (Balmuri Venkat) బల్యూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా రేసింగ్ అవకతవకలపై తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నేడు ప్రెస్‌మీట్ పెట్టారని అన్నారు. వెంటనే ఈ అంశంపై స్పందించిన కేటీఆర్.. (Drugs) డ్రగ్స్ గురించి స్పందించడం లేదంటే.. వాస్తవాలు ఏంటో తెలంగాణ సమాజానికి తెలిసిందన్నారు.
పదేళ్లుగా డ్రగ్స్ ఆరోపణలు కేటీఆర్‌పై ఉన్నాయని, ఏ రోజు కూడా దానిపై స్పందించలేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తానే గవర్నమెంట్ అని పేపర్ వర్క్ లేకుండా ఫండ్స్ రిలీజ్ చేశారని కేటీఆర్ ఒక దొర లాగా నేడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడారని ఫైర్ అయ్యారు. మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నా.. ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంటదని ప్రజాస్వామ్యం ముందు అది నడువదని బల్మూరి వెంకట్ అన్నారు.
కాగా, ఈ రేసింగ్ అవకతవకలపై తెలంగాణ భవన్‌లో (BRS) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఈ-రేస్‌ను మేము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా రూ. 55 కోట్లు ఖర్చు చేశామన్నారు. పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖలో ఇంటర్నల్ గా డబ్బు అడ్జస్ట్ మెంట్ చేసుకోవచ్చని, హెచ్ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డని, దానికి చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ పురపాలక శాఖ మంత్రి ఉంటారని పేర్కొన్నారు. మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా రూ. 55 కోట్లు కట్టమని నేనే అర్వింద్ కుమార్‌కి చెప్పానని అన్నారు. దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదని, హెచ్ఎండీఏ స్వతంత్ర బోర్డు అని అన్నారు.