ట్రాఫిక్‌లో చిక్కుకున్న పెళ్లి కూతురు.. ఏం చేసిందో తెలుసా? (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-21 14:03:45.0  )
ట్రాఫిక్‌లో చిక్కుకున్న పెళ్లి కూతురు.. ఏం చేసిందో తెలుసా? (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: అందంగా ముస్తాబైన ఓ పెళ్లి కూతురు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ముహూర్తం దగ్గర పడుతుండటంతో బంధువులంతా టెన్షన్ పడ్డారు. అయితే ఆమె వెంటనే మెట్రో రైలులో కల్యాణమండపానికి చేరుకుంది. ఈ ఘటన బెంగళూరు లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఈ ఇన్సిడెంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.

పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే వేల మంది ఈ వీడియోను వీక్షించారు. వాట్ ఏ బ్రైడ్ అంటూ వీడియోకు కామెంట్ పెట్టగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒంటి నిండా నగలతో పెళ్లి కూతురు మెట్రోలో ప్రయాణించడంతో ప్రయాణికులంతా వధువును ఆసక్తిగా చూశారు. కొంత మంది యువతులు పెళ్లికూతురితో సెల్ఫీలు దిగారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నెటిజన్లు ఈ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story