మీకు నచ్చింది చేసుకొండి.. పార్టీ సస్పెన్షన్ వేటుపై ప్రిణీత్ కౌర్ ఘాటుగా స్పందన

by Harish |   ( Updated:2023-02-06 13:59:34.0  )
మీకు నచ్చింది చేసుకొండి.. పార్టీ సస్పెన్షన్ వేటుపై ప్రిణీత్ కౌర్ ఘాటుగా స్పందన
X

న్యూఢిల్లీ: పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వివరణ ఇచ్చుకోవాలని ఎంపీ ప్రిణీత్ కౌర్‌ను కాంగ్రెస్ కోరడంపై ఆమె ఘాటుగా స్పందించారు. మీకు నచ్చింది చేసుకొమ్మని పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ కాంగ్రస్ పంజాబ్ చీఫ్‌తో పాటు మరికొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసి, వివరణ ఇచ్చుకోవాలని కోరింది. దీనిపై కౌర్ స్పందిస్తూ.. 'నాపై ఆరోపణలు చేసిన వారిపై కూడా అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని అన్నారు. నా భర్త అమరీందర్ సింగ్‌ను అడిగితే వివరాలు తెలిస్తాయి. సొంత పార్టీ నేతలని మీకు గతంలో మద్దతిచ్చారు. అయితే నియోజకవర్గ విషయాల గురించే కేంద్రంలో అధికారంలో ఉన్న నేతలతో చర్చించాను' అని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోనూ ఇదే జరుగుతుందని చెప్పారు. సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలుస్తాయని తెలిపారు. అయినప్పటికీ చర్యలు తీసుకోవాలని అనుకుంటే మీకు నచ్చింది చేసుకోవాలని అన్నారు. కాగా, కౌర్ భర్త కెప్టెన్ అమరీందర్ కాంగ్రెస్‌ను వీడి తాజాగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story