- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UP Rape Case: మ్యాచ్ అయిన డీఎన్‌ఏ.. సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత నిందితుడే!
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన రేప్ కేసులో నిందితుడి డీఎన్‌ఏ బాధితురాలి నుంచి సేకరించిన శాంపిల్‌తో మ్యాచ్ అయింది. ఈ మేరకు అధికారులు సోమవారం ప్రకటించారు. కన్నౌజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కమలేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు నవాబ్ సింగ్ యాదవ్ కన్నౌజ్‌లో ఓ ప్రయివేటు విద్యా సంస్థ నడిపేవాడు. అక్కడ కోచింగ్ కోసం వచ్చిన ఓ 15 ఏళ్ల బాలికను ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి అనుభవించాడు. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆగస్ట్ 12న కేసు నమోదు చేసిన పోలీసులు.. నవాబ్‌సింగ్‌ని అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత బాధిత బాలికతో పాటు నావాబ్ సింగ్ నుంచి శాంపిల్స్ సేకరించి డీఎన్‌ఏ పరీక్ష కోసం ఆగ్రాలోని ఫోరెన్సిక్ సైన్సెస్ లేబోరేటరీకి పంపించారు. పరీక్షల్లో డీఎన్‌ఏ మ్యాచ్ కావడంతో నిందితుడు నవాబ్ సింగ్ బాలికని బలాత్కారించినట్లు తేలింది. దీంతో తదుపరి చర్యలు తీసుకోబోతున్నట్లు సీఐ వెల్లడించారు.
కాగా.. నిందితుడు నవాబ్ సింగ్ యాదవ్ ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీ తరపున కన్నౌజ్ నియజకవర్గంలో బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేసి ఉండడం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు అధికార బీజేపీ నేతలంతా సమాజ్‌వాదీ పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై మండిపడుతున్నారు. అంతేకాకుండా కన్నౌజ్ మాజీ ఎంపీ, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌కి నవాబ్ సింగ్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు.