కుక్క కూడా బీఏ చదువుతోంది- రాజకీయ దుమారం రేపుతోన్న డీఎంకే నేత వ్యాఖ్యలు

by Shamantha N |
కుక్క కూడా బీఏ చదువుతోంది- రాజకీయ దుమారం రేపుతోన్న డీఎంకే నేత వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: డీఎంకే నేత ఆర్ఎస్ భారతి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతోన్నాయి. కుక్క కూడా బీఏ చదువుతోందని వివాదాస్పద కామెంట్లు చేశారు. నీట్‌ పరీక్ష రద్దు చేయాలని డీఎంకే విద్యార్థి విభాగం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కాంచీపురం ఎమ్మెల్యే ఎళిలరసన్ సహా డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఆర్ఎస్ భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.“నేను న్యాయవాదిని. బీఎల్ చదివా. ఎళిలరాసన్ బి.ఇ., బి.ఎల్. ఇవేవీ వంశపారపర్యంగా వచ్చినవి కావు. నేను బి.ఏ చదివేప్పుడు ఊరికి ఒక్కరే డిగ్రీ చేసేవారు. ఇంటి బయట నేమ్ బోర్డుపై అది రాసుకునేవారు. ఇప్పుడు ఊర్లో అందరూ డిగ్రీ చదువుతున్నారు. కుక్క కూడా బీఏ డిగ్రీ చేస్తోంది. ఈ అభివృద్ధికి ద్రవిడ ఉద్యమమే కారణం.” అని ఆర్ఎస్ భారతి అన్నారు.

డీఎంకే నేతపై బీజేపీ ఆగ్రహం

ఆర్‌ఎస్ భారతి చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మండిపడ్డారు. భారతి కామెంట్లు తమిళనాడు విద్యార్థులందరినీ అవమానించేలా ఉన్నాయని నిప్పులు చెరిగారు. తమిళనాడులో కేవలం ఐదు మెడికల్ కాలేజీలను తెరిచిన డీఎంకే.. డాక్టర్ల సంఖ్యను పెంచే బాధ్యత తమదే అని చెబుతోందని విమర్శించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా డీఎంకేపై విమర్శలు గుప్పించారు.

Next Story

Most Viewed