- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Patani: కేటుగాళ్ల మోసం.. రూ.25 లక్షలో పోగొట్టుకున్న దిశా పటానీ తండ్రి
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి, జగదీశ్ సింగ్ పటానీ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. జగదీష్ చంద్ర బరేలీకి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ. ఉన్నత పదవిని ఇప్పిస్తామంటూ కొందరు మోసగాళ్లు ఆయన నుంచి రూ.25 లక్షలు కాజేశారు. దీంతో నటి (Disha Patani) తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బరేలీ ప్రాంతానికి చెందిన జగదీశ్ పటానీకి (Disha Patani Father) కొన్ని రోజుల క్రితం తన కామన్ ఫ్రెండ్ ద్వారా దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తులు పరిచయమయ్యారు. తమకు రాజకీయ నేతలతో దగ్గరి సంబంధాలున్నాయని వారు బాధితుడ్ని మభ్యపెట్టారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే కమిషన్‌లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లేదా ఉన్నతస్థాయి పదవిని ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. ఇందుకు ఆయన నుంచి రూ.25లక్షలు తీసుకున్నారు.
మూడు నెలల తర్వాత బెదిరింపులు
జగదీశ్ డబ్బులు ఇచ్చి మూడు నెలలు గడిచినా పదవి ఇప్పించకపోవడంతో జగదీశ్ (Disha Patani's father Jagdish Singh Patani Duped) వారిని నిలదీశారు. దీంతో ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా తిరిగిస్తామన్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో, జగదీశ్ పటానీ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టినట్లు తెలిపారు.