ఎల్జీ శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలి.. మహిళలకు రక్షణ కూడా లేదు: ఢిల్లీ సీఎం

by Harish |   ( Updated:2023-01-20 13:39:14.0  )
ఎల్జీ శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలి.. మహిళలకు రక్షణ కూడా లేదు: ఢిల్లీ సీఎం
X

న్యూఢిల్లీ: ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య పోరు నడుస్తూనే ఉంది. తాజాగా మరోసారి కేజ్రివాల్ ఎల్జీపై మండిపడ్డారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని ఆయన సక్సేనాకు సూచించారు. అంతకుముందు కేజ్రివాల్ కు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కలిసేందుకు అనుమతిస్తున్నట్లు ఎల్జీ లేఖలో పేర్కొన్నారు. అయితే 70-80 మంది ఎమ్మెల్యేలను కలిసేందుకు అనుమతివ్వాలని కోరగా సక్సేనా తిరస్కరించారు. అయితే సక్సేనా కేవలం ఐదు నిమిషాలు మాత్రమే భేటీకి అంగీకరించారని కేజ్రివాల్ తెలిపారు.

అంతకుముందు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం తగ్గిందని సక్సేనా విమర్శించగా.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం, ఎల్జీలు జోక్యం చేసుకుని ఆటంకం కలిగిస్తున్నారని కౌంటర్ ఎటాక్ చేశారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయని కేజ్రివాల్ ఆరోపించారు.

నేరాలు పెరుగుతున్నాయని, మహిళలు ఇళ్ల నుంచి బయటకు వస్తే భద్రత లేకుండా పోయిందని అన్నారు. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు జరిగిన చేదు అనుభవాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు.

Advertisement

Next Story