Devendra Fadnavis: పేరు మార్చుకున్న దేవేంద్ర ఫడ్నవీస్?

by Shamantha N |
Devendra Fadnavis: పేరు మార్చుకున్న దేవేంద్ర ఫడ్నవీస్?
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర సీఎం(Maharashtra CM) ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. కాగా.. గురువారం మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ప్రమాణం చేయనున్నారు. గురువారం సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఇన్విటేషన్ లెటర్ సర్ ప్రైజ్ గా మారింది. మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్ జారీ చేసిన ఈ లెటర్ లో ఫడ్నవీస్ పేరు ‘‘ దేవేంద్ర సరితా గంగధరరావు ఫడ్నవీస్’’ అని ఉంది. ఇకపోతే, ఫడ్నవీస్ తల్లి పేరు సరిత కాగా, తండ్రి పేరు గంగాధర్.

పేరు మార్పు..?

సాధారణంగా మహారాష్ట్ర ప్రజలు తండ్రి పేరుని మిడిల్ నేమ్ గా వాడుతారు. అయితే, ఈసారి ఫడ్నవీస్ తల్లి పేరుని కూడా తన పేరుకు జోడించారు. తల్లి పేరుని వాడటం ఇదే తొలిసారి కూడా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తతన పేరుని ‘దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్’ గా పేర్కొన్నారు. 2014, న2019 ప్రమాణ స్వీకారోత్సవాల సమయంలోనూ తన తల్లిపేరుని తీసుకురాలేదు. ఫడ్నవీస్ యుక్త వయసులో ఉన్నప్పుడే ఆయన తండ్రి గంగాధర్ రావు క్యాన్సర్ తో చనిపోయారు. గంగాధర్ రావు బీజేపీ నేత. ఫడ్నవీస్ సీఎం కావాలని బీజేపీ సహా అందరూ కోరుకున్నట్లు ఆయన తల్లి సరిత తెలిపారు. ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ బ్యాంకర్, సామాజిక కార్యకర్త. వీరికి దివిజ అనే కూతురు ఉంది.

Advertisement

Next Story