- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొంపముంచిన బీజేపీతో పొత్తు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సస్పెండ్
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్డీయేతో పొత్తు అంశం జేడీఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీతో పొత్తును వ్యతిరేకించిన కర్నాటక జేడీఎస్ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను ఆ పార్టీ జాతీయ అధినేత దేవెగౌడ గురువారం నుండి సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కర్నాటక రాష్ట్ర శాఖకు తాత్కాలిక అధ్యక్షుడిగా కుమారస్వామిని నియమించారు. కాగా, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని జేడీఎస్ నేత సీఎం ఇబ్రహీం విభేదించారు.
జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకే అధికారం ఉంటుందని వారు (దేవేగౌడ, కుమారస్వామి) బీజేపీతో వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన స్టేట్ ప్రెసిడెంట్ సీఎం ఇబ్రహీంపై బహిష్కరణ వేటు వేశారు దేవెగౌడ. కాగా, ఈ పరిణామం కర్నాటక రాజకీయాల్లో భారీ కుదుపుగా మారింది. మరో వైపు దక్షిణ భారత దేశంలో పట్టు సాధించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు జేడీఎస్‌లో చీలిక తీసుకురావడం కమలనాథుల్లోనూ టెన్షన్‌గా మారింది.