ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం: ఆ చట్టాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

by samatah |   ( Updated:2024-01-03 06:20:19.0  )
ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం: ఆ చట్టాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాలు (భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య) అధ్యయనానికి ఢిల్లీ పోలీసులు13 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఐపీఎస్ ఆఫీసర్ చాయా శర్మ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ కొత్త నిబంధనలు, విధానాల్లో జరిగిన మార్పులను స్టడీ చేసి మెటీరియల్‌ను రూపొందించనుంది. విచారణ అధికారులకు అందుబాటులో ఉండేలా, వారికి సులభంగా అర్థమయ్యేలా దీనిని తయారుచేయనున్నారు. న్యాయ పరమైన ప్రక్రియలను సైతం తెలుసుకోవడానికి కమిటీకి కొంత మంది లాయర్ల సహాయం తీసుకోనుంది. పోలీసు సిబ్బందికి శిక్షణ సమయంలో కొత్త చట్టాలపై అవగాహన కల్పించడంలోనూ మెటీరియల్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేగాక కమిటీ తన అధికారులకోసం పోలీసులు ఉపయోగించే కొత్త శిక్షణా సామగ్రిని కూడా రూపొందించే అవకాశం ఉంది. మెటీరియల్‌లో మెరుగుదల కోసం జిల్లా డీసీఎస్పీ, ఢిల్లీ పోలీసు జాయింట్ సీఎస్పీని కూడా సంప్రదించనుంది. కాగా, డిసెంబర్ 25న ఈ మూడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే బిల్లుల అమలు తేదీకి సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదు.

Advertisement

Next Story