- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi BJP మేయర్ అభ్యర్థిగా రేఖాగుప్తా
న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. షాలిమర్ భాగ్ కౌన్సిలర్ రేఖా గుప్తా మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు జనవరి 6న జరిగే మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌పై పోటీ చేయనుంది. రేఖాకు మూడు సార్లు కౌన్సిలర్‌గా గెలిచిన అనుభవం ఉంది. అంతేకాకుండా కమల్ బగ్రీని డిప్యూటీ మేయర్‌గా ప్రకటించింది. ఇక కమల్ జీత్ షెరావత్, గజేంద్ర దరాల్, పంకజ్ లుత్రాను స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవికి బరిలో ఉంచినట్లు బీజేపీ నేత హరీష్ కురానా తెలిపారు.
ఈ నెల 7న వెలువడిన ఫలితాల్లో 250 సీట్లకు గానూ ఆప్ 134 గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ 104 సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆప్‌కే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దాదాపు ఖాయమైనప్పటికీ బీజేపీ కూడా బరిలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే స్టాండింగ్ కమిటీ సభ్యుల విషయంలో మాత్రం ఆప్ పోరాడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆప్ తరుఫున మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్‌గా మహ్మద్ ఇక్భాల్‌ను ప్రకటించింది. వీరిద్దరూ నామినేషన్లు కూడా దాఖలు చేశారు.
Also Read...