- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిహార్ జైలుకు చేరుకున్న ఈడీ అధికారుల బృందం
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాను విచారించేందుకు ఈడీ బృందం తీహార్ జైలుకు చేరుకుంది. మనీష్ సిసోడియాను 3 రోజుల పాటు విచారించేందుకు ఇప్పటికే అనుమతి పొందిన ఈడీ అధికారులు మంగళవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. మద్యం కుంభకోణంలో తొలిసారి మనీష్ సిసోడియాను ఈడీ ప్రశ్నిస్తుండటంతో ఏయే అంశాలను ఆరా తీయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఈ కేసులో పెద్ద ఎత్తున ముడుపుల చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇందులో సిసోడియా పాత్ర ఎంత అనే అంశంపై ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
మరో వైపు ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను సైతం ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో రెండు రోజుల పాటు ఇతడిని ప్రశ్నించిన ఈడీ ఈ సారి అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ అయ్యారు. ఈ వరుస అరెస్టులతో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వస్తోంది. ఈ కేసులో కవిత అరెస్ట్ అవుతారని గత కొంత కాలంగా బీజేపీ నేతలు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చారు. అరుణ్ పిళ్లై అరెస్ట్‌తో ఈ కేసులో హూ ఈజ్ నెక్స్ట్ అనేది సస్పెన్స్‌గా మారింది.