- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లిక్కర్ స్కామ్: ఢిల్లీ హైకోర్టులో బోయిన్‌పల్లి అభిషేక్‌కు చుక్కెదురు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బోయిన్‌పల్లి అభిషేక్ బెయిల్‌పై ఆ రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా పడింది. లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు గతంలో అభిషేక్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈయనతో పాటు విజయ్‌నాయర్‌కు కూడా బెయిల్ ఇచ్చింది.
స్పెషల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో సీబీఐ గతేడాది నవంబరులో పిటిషన్ దాఖలు చేసింది. స్కామ్‌పై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతున్న సమయంలో వారికి బెయిల్ మంజూరు చేయడాన్ని తప్పుపట్టింది. వారి బెయిల్‌ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ వాదించింది. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిగిన అనంతరం సోమవారం సైతం జస్టిస్ దినేష్ కుమార్ శర్మ నేతృత్వంలోని బెంచ్ ముందు వాదనలు జరిగాయి.
బోయిన్‌పల్లి అభిషేక్ తరఫున హాజరైన న్యాయవాది సరికొత్త వాదనను లేవనెత్తారు. అభిషేక్ కుమారుడిని స్కూల్‌లో చేర్పించాల్సి ఉన్నదని, అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా తల్లిదండ్రులిద్దరూ హాజరుకావాల్సి ఉన్నదని కోర్టుకు వివరించారు. గతంలో స్పెషల్ కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు సైతం అభిషేక్‌పై సీబీఐ నమోదు చేసిన కేసులో గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష పడే తరహా అభియోగాలు మాత్రమే నమోదైనట్లు వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు.
న్యాయవాది లేవనెత్తిన వాదనను గుర్తుచేసిన ఢిల్లీ హైకోర్టు బెంచ్, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు అర్హమైనదో కాదో తేల్చాల్సి ఉన్నదని పేర్కొని తగిన వివరణ ఇవ్వాల్సిందిగా ఈడీకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కేసులో బెయిల్ లభించినప్పటికీ ఈడీ సైతం అభిషేక్ వ్యవహారంపై మనీ లాండరింగ్ కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నందున ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు జారీచేయాల్సి వచ్చింది.
Also Read..
భర్తకు హగ్ ఇచ్చిన కవిత.. ఈడీ విచారణకు ముందు ఆసక్తికర సీన్ (వీడియో)