సిసోడియాకు బెయిల్ నిరాకరణ.. ఆయనపై ఆరోపణలు తీవ్రమైనవి : ఢిల్లీ హైకోర్టు

by Vinod kumar |   ( Updated:2023-05-30 13:04:11.0  )
సిసోడియాకు బెయిల్ నిరాకరణ.. ఆయనపై ఆరోపణలు తీవ్రమైనవి : ఢిల్లీ హైకోర్టు
X

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. సిసోడియాపై సీబీఐ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని జస్టిస్ దినేష్ కుమార్ తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలపై సిసోడియా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు తెలిపారు. సిసోడియాకు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఇబ్బంది కలుగుతుందని కోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఢిల్లీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సిసోడియాకు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వాదించారు.

మీడియా సమావేశాల్లో ఆప్ నేతలు చేసిన ప్రకటనలను గుర్తు చేసిన సీబీఐ న్యాయవాది నిందితుడిని రక్షించేందుకు ఆయన సహచరులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే.. ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవకతవకలు జరిగినట్లు సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని సిసోడియా తరఫు న్యాయవాది దయన్ కృష్ణన్ వాదించారు. సిసోడియా మినహా సీబీఐ కేసులో నిందితులంతా బెయిల్ పై విడుదలయ్యారని గుర్తు చేశారు. సిసోడియా జూన్ ఒకటో తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read..

బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెరపైకి మళ్లీ కవిత పేరు

Advertisement

Next Story