- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపావళికి పటాకులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష.. పండుగకు ముందే ప్రభుత్వం కీలక ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ దీపావళి సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ, వినియోగంపై మళ్లీ నిషేధం విధిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ ప్రకటన జారీ చేసింది. శీతాకాలంలో పర్యావరణ కాలుష్య స్థాయిని అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకుందని మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరమంతటా నిషేధాన్ని అమలు చేయాలని ఢిల్లీ పోలీసులకు కఠిన ఆదేశాలు ఇస్తామని చెప్పారు.
గత మూడేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తోందన్నారు. గత ఆరేళ్లలో ఢిల్లీలో గాలి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని, అయితే తాము దానిని మరింత మెరుగుపరచాలని అన్నారు. అందువల్ల, ఈ సంవత్సరం కూడా పటాకులను నిషేధించాలని మేము నిర్ణయించుకున్నామని రాయ్ స్పష్టంచేశారు. పటాకుల లైసెన్సుల మంజూరును మానుకోవాలని ఎన్‌సీఆర్ రాష్ట్రాల అధికారులకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మత విశ్వాసాలను జరుపుకోవాలని నొక్కిచెప్పిన రాయ్, ప్రాణాలను రక్షించడానికి సమిష్టి కృషి అవసరం. మేము ఢిల్లీ వాసులు దీపావళిని దీపాలతో జరుపుకుంటామని గుర్తుచేశారు. దీపావళి సమీపిస్తున్న తరుణంలో శీతాకాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలతో కాలుష్య హాట్‌స్పాట్‌ల పర్యవేక్షణను కూడా ప్రారంభించారని ఆయన వెల్లడించారు.
ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలకు సంబంధించి పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9బీ కింద రూ. 5 వేల వరకు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. దీపావళి సందర్భంగా ఎవరైనా పటాకులు పేల్చితే ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది.