Arvind Kejriwal: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

by S Gopi |
Arvind Kejriwal: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయమూర్తి (సీబీఐ) కావేరీ బవేజా కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 20 వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ తిరస్కరణకు గురయ్యాయి. జూన్ 20న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ వెంటనే సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో కేజ్రీవాల్ విడుదల ఆగిపోయింది. ఎన్నికల సమయంలో కొద్దిరోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ మళ్లీ జైలుకు వెళ్లారు. ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్‌ నాయకురాలు కె.కవిత సహా పలువురు నిందితులను కూడా సీబీఐ అరెస్టు చేసింది.

Advertisement

Next Story

Most Viewed