Pooja Khedkar: పూజా ఖేద్కర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు

by Harish |   ( Updated:2024-07-31 09:18:16.0  )
Pooja Khedkar: పూజా ఖేద్కర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఖేద్కర్ దాఖలు చేసిన దరఖాస్తుపై వాదనలు విన్న తర్వాత అదనపు సెషన్స్ జడ్జి దేవేందర్ కుమార్ జంగాలా ఆగస్టు 1న ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్, యూపీఎస్సీ తరపు న్యాయవాదులు ఇద్దరూ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించారు, ఆమె "వ్యవస్థను మోసం చేసింది" అని, చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు, ఆమె చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.

ఇదిలా ఉంటే, పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా.. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై ఢిల్లీలో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 821 సాధించిన పూజ ఖేద్కర్ ఇటీవల పూణేలో శిక్షణ సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి వార్తల్లోకి ఎక్కింది. దీంతో ప్రస్తుతం ఆమె ట్రైనింగ్‌ను యూపీఎస్సీ నిలిపివేసింది. అలాగే షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

Advertisement

Next Story