- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనీశ్ సిసోడియా ఆస్తులను జప్తు చేసిన ఈడీ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రియాక్షన్ ఇదే
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు నిన్న ఈడీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శనివారం ఈ విషయంపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. మనీశ్ సిసోడియాకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, అయితే అవన్నీ సిసోడియాకు చెందిన ఫ్లాట్లని పేర్కొన్నారు. ఈ ఫ్లాట్లను సిసోడియా ఎక్సైజ్ పాలసీకి ముందే 2018లో కొనుగోలు చేశారని తెలిపారు.
వీటన్నింటినీ సిసోడియా ఆదాయపు పన్ను, ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారని చెప్పారు. ఆప్ కు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే ఈడీ ఇలా చేసిందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.