గత ఎనిమిదేళ్లలో కాలుష్యం తగ్గింది.. అభివృద్ధి పెరిగింది: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

by Javid Pasha |
delhi cm aravind kejriwal
X

దిశ, వెబ్ డెస్క్: గత ఎనిమిదేళ్లలో ఢిల్లీలో కాలుష్యం తగ్గిందని.. అభివృద్ధి పెరిగిందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా త్యాగరాజ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు. అభివృద్ధిలో భాగంగా చట్ల నరికివేత, రోడ్ల నిర్మాణం వంటి సర్వసాధారణమన్నారు. గత ఎనిమిదేళ్లో ఢిల్లీలో ఎన్నో స్కూల్స్, ఆసుపత్రులు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మించామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

2016లో నెలలో 26 రోజులు కాలుష్యమే ఉండేదని, కానీ 2022కు వచ్చేసరికి ఆ సంఖ్య 6 తగ్గిందని చెప్పారు. 2013లో 20 శాతం ఉన్న చెట్లు ప్రస్తుతం 23 శాతానికి పెరిగాయని చెప్పారు. గత 50 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్న కేజ్రీవాల్.. ప్రతి చోటా కాలుష్యం పెరిగిందని, కానీ ఒక్క ఢిల్లీలో మాత్రం తగ్గిందని పేర్కొన్నారు.

Advertisement

Next Story