- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని రంగాలను మోడీ అస్తవ్యస్తం చేశారు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని అన్ని రంగాలను ప్రధాని మోడీ అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సదర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా దేశాన్ని పాలించే అవకాశాన్ని ప్రధాని మోడీకి దేశ ప్రజలు ఇచ్చారని, కానీ మోడీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదని అన్నారు. ఈ పదేళ్ల కాలంలో మోడీ దేశ ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టించారని చెప్పారు.
మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిందని చెప్పారు. తీవ్ర ద్రవ్యోల్బణం ఏర్పడి అన్ని రంగాల్లో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. మోడీని గద్దెదించాల్సిన సమయం వచ్చిందని, అందుకోసం అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా బెంగళూరులో రెండో రోజు కొనసాగుతున్న విపక్షాల మీటింగ్ కు దాదాపు 26 పార్టీల నాయకులు హాజరయ్యారు.