- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భద్రతా వలయంలో హస్తిన .. బార్డర్లలో హైఅలర్ట్.. రైతన్నల ‘చలో ఢిల్లీ’ ఎఫెక్ట్
దిశ, నేషనల్ బ్యూరో : రైతుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం మంగళవారం (ఫిబ్రవరి 13) జరగనున్న నేపథ్యంలో దేశ రాజధాని బార్డర్‌లలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కనీస మద్దతు ధర చట్టం, 60 ఏళ్లు నిండిన రైతులకు ఆర్థిక సాయం సహా పలు డిమాండ్లను పరిష్కరించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాన్ని అన్నదాతలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఆదివారమే రోడ్డు మార్గంలో బయలుదేరారు. దీంతో ఢిల్లీ చుట్టూ ఉన్న బార్డర్ ఏరియాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ - హర్యానా బార్డర్‌లోనైతే నిరసన తెలిపేందుకు గుమిగూడే రైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను గగన తలం నుంచి జారవిడిచే డ్రోన్లను సైతం మోహరించారు. 200కుపైగా రైతు సంఘాలు కలిసి నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమంలో దాదాపు 20వేలమంది రైతులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 2,000కుపైగా ట్రాక్టర్లతో దేశ రాజధానిలోకి ప్రవేశించాలని రైతు సంఘాలు నిర్ణయించాయని నిఘా వర్గాల సమాచారం అందడంతో.. ఢిల్లీ బార్డర్‌లలోని రోడ్లపై ఇనుప మేకులు, ముళ్ల తీగలు, కాంక్రీట్ పిల్లర్లను పరిచారు. ఎట్టి పరిస్థితులలోనూ ఆందోళనకారులను రాజధాని లోపలికి అనుమతించేది లేదని ఢిల్లీ పోలీసు అధికార వర్గాలు అంటున్నాయి. హస్తినలోకి ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి లేదని చెబుతున్నాయి. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. లౌడ్ స్పీకర్ల వాడకంపైనా ఆంక్షలు ప్రకటించారు.
రెండోవిడత చర్చలు
‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు సోమవారం సాయంత్రం చండీగఢ్‌లో రెండోవిడతగా భేటీ అయ్యారు. ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, వ్యయసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, సంయుక్త కిసాన్ మోర్చా- ఎస్కేఎమ్ నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ సహా తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టులో పిటిషన్
చలో ఢిల్లీ కార్యక్రమం నేపథ్యంలో హర్యానాలో మంగళవారం రాత్రి వరకు ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలపై ఆంక్షలు విధించారు. ఢిల్లీలో పోలీసులు నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రైతులను అడ్డుకునేందుకు పంజాబ్, హర్యానా, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ ఉదయ్ ప్రతాప్ సింగ్ కోర్టును కోరారు. ఈ చర్యలు రైతుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని, అవి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కాగా, ఆందోళనల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్తున్న కర్ణాటక రైతులను భోపాల్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
Read More..
కానిస్టేబుల్ అభ్యర్థులకు సూపర్ న్యూస్.. హైపవర్ కమిటీతో సీఎం రేవంత్ భేటీ