- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: లిక్కర్ స్కాం కేసులో మరో ట్విస్ట్.. సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన అత్యున్నత న్యాయస్థానం
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేసింది. ఇవాళ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ తరుఫు న్యాయవాది అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌లో కేజ్రీవాల్ అరెస్ట్‌ను సవాల్ చేయడమే కాక ఆయనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ కలిసేందుకు ఆయన లాయర్‌కు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతుండటంతో లాయర్ కలిసేందుకు సమయం సరిపోవడం లేదని, కనీసం ఐదుసార్లు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ నేపథ్యంలో ఆ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు కేజ్రీవాల్ దాఖలు చేసిన అభ్యర్థనను వెంటనే పరిశీలిస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ బుధవారం తెలిపారు.
కాగా, లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో ఆయనే కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ కస్టడీ అనంతరం కేజ్రీకి రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15వరకు ఆయన తీహార్ జైల్లోనే ఉండనున్నారు.