బ్రిటన్ డీఎస్టీఎల్‌తో మన డీఆర్డీఓ జట్టు.. ఎందుకో తెలుసా ?

by Hajipasha |
బ్రిటన్ డీఎస్టీఎల్‌తో మన డీఆర్డీఓ జట్టు.. ఎందుకో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత తొలిసారిగా భారత రక్షణమంత్రి బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ మంగళవారం బ్రిటన్ రాజధాని లండన్‌కు చేరుకున్నారు. తొలుత టావిస్టాక్ స్క్వేర్‌‌కు వెళ్లి భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం బ్రిటన్ రక్షణమంత్రి గ్రాంట్ షాప్స్‌తో భేటీ అయిన రాజ్‌నాథ్ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. రక్షణ రంగానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పరస్పర సహకారం కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), బ్రిటన్‌కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ(డీఎస్టీఎల్) మధ్య లెటర్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌పై ఇద్దరు రక్షణ మంత్రులు సంతకాలు చేశారు. ఇందులో భాగంగా రక్షణరంగ ఆర్‌అండ్‌డీ విభాగంలో యువతను ఇరుదేశాలు మార్పిడి చేసుకునేందుకు మార్గం సుగమం అయింది. ద్వైపాక్షిక అంతర్జాతీయ క్యాడెట్ మార్పిడి కార్యక్రమంపై కూడా బ్రిటన్, భారత్‌లు ఈసందర్భంగా అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Advertisement

Next Story