ఆ సంస్థలను కూడా ఉగ్రసంస్థలుగా ప్రకటించండి: ఐఎంసీ చీఫ్ మౌలానా తకీర్

by Mahesh |
ఆ సంస్థలను కూడా ఉగ్రసంస్థలుగా ప్రకటించండి: ఐఎంసీ చీఫ్ మౌలానా తకీర్
X

న్యూఢిల్లీ: హర్యానా భివానీలో ఇద్దరు ముస్లింల హత్య ఘటన నేపథ్యంలో ఇత్తిహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తకీర్ రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైట్ వింగ్ సంస్థలైన విశ్వహిందు పరిషత్(వీహెచ్ పీ), భజరంగ్ దళ్‌లను పీఎఫ్ఐ లాగా ఉగ్ర సంస్థలుగా ప్రకటించిన వాటిపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘భివానీ ఘటన ఫిబ్రవరి 16న జరిగినా మేము మౌనంగా ఉన్నాం. మా పిల్లలపై (జునైద్, నాసిర్) తప్పుడు ఆరోపణలు చేసి హత్య చేశారు.

నిందితులకు మద్దతుగా సమావేశాలు, మహాపంచాయత్‌లు జరిగినప్పుడు భారతదేశంలో హత్యలు, మూకదాడులు సర్వసాధారణమై పోయాయని మేము భావించాం’ అన్నారు. పీఎఫ్ఐ పై నిషేధం విధించినట్లు గానే వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ పై కూడా నిషేధం విధించాలని అన్నారు. భివానీ ఘటన హిందూ కమ్యూనిటీకి కూడా చెడు సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతూ హీరోలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పాలన వ్యవస్థ దీనిని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed