వయనాడా.. రాయ్ బరేలా?.. మరో మూడు నాలుగు రోజుల్లో రాహుల్ ఎంపీ స్థానంపై నిర్ణయం

by Shamantha N |
వయనాడా.. రాయ్ బరేలా?.. మరో మూడు నాలుగు రోజుల్లో రాహుల్ ఎంపీ స్థానంపై నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఆయన ఏ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తారో తెలియాల్సి ఉంది. కాగా.. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. వాస్తవానికి, ఆ నిర్ణయం జూన్ 17 లోగా తీసుకోవాల్సి ఉందన్ననారు. కానీ, మరోమూడు నాలుగు రోజుల్లో రాహుల్ ఎంపీగా ఉండే స్థానంపై క్లారిటీ వస్తుందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈవిషయాన్ని తెలిపారు.

రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్

ఇకపోతే, రాహుల్ గాంధీ రెండోసారి వరుసగా వయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. సీపీఐకి చెందిన అన్నీ రాజాపై భారీ మెజార్టీతో గెలిచారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో పోటీ చేసిన రాహుల్ గాంధీ.. బీజేపీ నేత దినేష్ ప్రతాప్ పై గెలుపొందారు. 5 సార్లు రాయ్ బరేలీ ఎంపీగా గెలిచిన సోనియా గాంధీ .. ఆరోగ్యసమస్యలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు వెళ్లారు. దీంతో అక్కడ్నుంచి రాహుల్ గాంధీ బరిలో దిగారు. ఇకపోతే, రాహుల్ గాంధీ 2004, 2009, 2014 లో అమేథీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2019లో అమేథీలో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఘోర పరాజయం పొందారు. 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్.. వయనాడ్ లో మాత్రం గెలిచారు.

Advertisement

Next Story

Most Viewed