- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయం 11 గంటల్లోగా తేల్చేయండి.. ‘మహా’ సర్కారుకు జరాంగే అల్టిమేటం
దిశ, నేషనల్ బ్యూరో: మరాఠా కోటా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే మహారాష్ట్ర సర్కారుకు అల్టిమేటం ఇచ్చారు. శనివారం ఉదయం 11 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకారం తెలపాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని జరాంగే డిమాండ్ చేశారు. ఒకవేళ తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ముంబైలోని ఆజాద్ మైదాన్‌కు పెద్దఎత్తున చేరుకొని నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశం అనంతరం నవీ ముంబైలోని శివాజీ చౌక్‌లో నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మనోజ్ జరాంగే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. ఆజాద్ మైదాన్‌కు వెళ్లి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనక్కి తీసుకోను’’ అని ఆయన స్పష్టం చేశారు. మరాఠా కమ్యూనిటీకి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు మంజూరు చేసే వరకు నిరసనలు ఆపేది లేదన్నారు. ‘‘చర్చల సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధి బృందం నాకు కొన్ని పత్రాలను ఇచ్చింది. ఆందోళనకారులు అందరితో చర్చించాక ఏం చేయాలనే దానిపై తదుపరి నిర్ణయం తీసుకుంటాం’’ అని జరాంగే వెల్లడించారు. ఈ పరిణామాలపై మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ స్పందిస్తూ నిరసనకారుల డిమాండ్లను ఆమోదించినట్లు చెప్పారు. కుంబీ కులానికి చెందిన వారిని ఓబీసీలుగా పరిగణిస్తూ ఇప్పటివరకు 37 లక్షల సర్టిఫికెట్లను ఇచ్చామన్నారు. ఈ సంఖ్య త్వరలోనే 50 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు.