South Africa : వారికి చావే శరణ్యం : మైనర్లపై సౌతాఫ్రికా కఠిన నిర్ణయం

by M.Rajitha |
South Africa : వారికి చావే శరణ్యం : మైనర్లపై సౌతాఫ్రికా కఠిన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : నాలుగు వేల మంది మైనర్ల విషయంలో సౌతాఫ్రికా(South Africa) కఠిన నిర్ణయం తీసుకుంది. బంగారం కోసం మూసివేసిన గని(Closed Mine)లోకి వెళ్ళి చిక్కుకు పోయిన 4 వేల మంది మైనర్లకు ఎలాంటి సహాయం అందించేది లేదని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది. గనిలో ఇరుక్కు పోయిన వారిని బయటికి తీసుకు వచ్చేందుకు ఎలాంటి సహాయం చేయబోమని.. పైగా బయటి నుంచి గనిని మూసి వేస్తామని ప్రకటించింది. ఎవరైనా లోపల చిక్కుకున్న వారికి సహాయం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. సౌతాఫ్రికా వాయువ్య ప్రాంతంలో ఉన్న ఓ మూసి వేసిన బంగారం గనిలోకి అక్రమ మైనింగ్ కోసం దాదాపు 4 వేల మంది మైనర్లు వెళ్ళి చిక్కుకున్నట్లు స్థానిక మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ విషయాన్ని నిజమని నిర్ధారించుకున్న ప్రభుత్వం.. వారికి ఎలాంటి సహాయం చేసేది లేదని, వారి బయటికి వస్తే అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని పేర్కొంది. లోపలి వారికి ఎవరైనా సహాయం చేస్తే వారిని కూడా జైల్లో వేస్తామని తెలిపింది.

Advertisement

Next Story