భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే

by Mahesh |
భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ఘోర ప్రమాదాలేవో ఇక్కడ తెలుసుకుందాం. 1981లో బీహార్‌లో రైలు అదుపుతప్పి బాగమతి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 800 మంది ప్రయాణికులు చనిపోయారు. భారత దేశ చరిత్రలో ఒకే ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. అలాగే 1995లో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఫిరోజాబాద్ సమీపంలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దీంతో 300-400 మంది మరణించారు. 1998లో పంజాబ్‌లో రైలు ఢీకొన్న ప్రమాదంలో 200 మందికి పైగా మరణించారు. అలాగే 2016లో ఉత్తరప్రదేశ్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 150 మంది చనిపోయారు.

దీని తర్వాత ఇంత భారీ ప్రమాదం తిరితి 2023 జూన్ 2న ఒడిశా లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి మూడు బోగీలు పక్క ట్రాక్ పై బోల్తా పడ్డాయి. అనంతరం ఆ ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు బోల్తా పడిన బోగిలను ఢీకొట్టింది. అలాగే మరో రైలు కూడా ఆ బోగిలను ఢీ కొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకోగా.. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మొత్తం 280 మంది ప్రయాణికులు మృతి చెందగా.. మరో 900 మంది గాయాల పాలయ్యారు. అలాగే మరో 500 మందికి పైగా ప్రయాణికులు రైలు భోగి లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా గడిచిన పది సంవత్సరాల్లో ఇదే అత్యధిక ప్రమాదంగా అధికారులు తెలిపారు.

Also Read.. ఒడిశా రైలు ప్రమాదాన్ని ‘కవచ్’ టెక్నాలజీ ఎందుకు ఆపలేకపోయింది..?

Odisha train accident: కారణాలు ఇప్పుడే చెప్పలేం, ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు..

Next Story

Most Viewed