వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ భోజనంలో చనిపోయిన బొద్దింక

by Ramesh N |   ( Updated:2024-02-06 12:36:44.0  )
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ భోజనంలో చనిపోయిన బొద్దింక
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని రైల్వే ప్యాంట్రీల్లో భోజనం బాగుండదని ప్రయాణికులు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ భోజనాలు నాసిరకం, ఆహారపదార్థాల వద్ద ఎలుకలు తిరగడం లాంటి వాటిపై సోషల్ మీడియాలో ఎన్నో సార్లు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి విషయాలపై ఐఆర్‌సీటీసీ కూడా ఎన్నో సార్లు స్పందించింది కూడా. అయిన ఐఆర్‌సీటీసీలో ఎలాంటి మార్పు కనబడటం లేదని ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వందే భార‌త్ లాంటి ప్రతిష్టాత్మక రైళ్లలో కూడా ఫుడ్ మంచిగా లేదని ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. వందే భారత్ రైలులో భోజనం నాసిరకంగా ఉంటుందిని, దుర్వాసన వస్తుందని ఇటీవల ఓ వ్యక్తి వీడియో తీసి రైల్వే కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వందే‌భారత్ రైళ్లలో మరో ప్రయానికుడికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ వాసి సుభేందు కేసరి అనే వ్యక్తి జబల్పూర్ వెళ్తున్న వందే భారత్‌లో నాన్ వెజ్ మీల్ ఆర్డర్ పెట్టగా అందులో చనిపోయిన బొద్దింక వచ్చింది.

దీంతో షాకైన ప్రయాణికుడు ఐఆర్సీటీసీకి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేసి.. ఆ ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వెంటనే స్పందించిన ఐఆర్సీటీసీ అతనికి క్షమాపణలు చెప్పింది. కారకులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, నెటిజన్లు మాత్రం రైల్వే భోజనం విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story