ఖాకీ బట్టలతో హోలీ సంబరాల్లో డాన్స్.. ఎక్సైజ్ కమీషనర్ సస్పెండ్!

by Ramesh Goud |   ( Updated:2024-04-01 08:30:58.0  )
ఖాకీ బట్టలతో హోలీ సంబరాల్లో డాన్స్.. ఎక్సైజ్ కమీషనర్ సస్పెండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖాకీ బట్టలతో హోలీ సంబరాల్లో పాల్గొని, డాన్స్ చేసిన ఎక్సైజ్ కమీషనర్ సస్పెండ్ అయిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వికాస్ త్రిపాఠి అసిస్టెంట్ ఎక్సైజ్ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన హోలీ పండుగ సందర్భంగా తోటి అధికారులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అంతేగాక డీజే పాటలు పెట్టి వారితో డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఓ అధికారి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారి, పై అధికారుల చెంతకు చేరాయి. దీంతో ఖాకీ బట్టలు వేసుకొని డాన్స్ చేశారని, విధుల్లో ఉండి నిబందనలకు విరుద్దంగా ప్రవర్తించారంటూ.. వికాస్ త్రిపాఠిని సస్పెండ్ చేస్తున్నట్లు పై అధికారులు ప్రకటించారు.

Read More..

షాకింగ్ ఘటన.. చెట్టు నుంచి ఉప్పొంగి వస్తున్న నీళ్లు.. (వీడియో)

Advertisement

Next Story