దానా తుఫాన్ ఎఫెక్ట్.. సివిల్ సర్వీస్ పరీక్ష వాయిదా

by M.Rajitha |
దానా తుఫాన్ ఎఫెక్ట్.. సివిల్ సర్వీస్ పరీక్ష వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు, మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా ఆ తర్వాత తుఫానుగా మారింది. కాగా ఐఎండీ ఈ తుఫానుకు "దానా"(Dana) అని నామకరణం చేసింది. దానా తుఫాను గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వలన భీభత్సమైన ఈదురు గాలులు వీస్తుండటం, కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. కాగా దానా తుఫాను నేపథ్యంలో ఒడిషా ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 27న జరగాల్సిన ఒడిషా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. అలాగే ఒడిషాలోని ప్రముఖ నందన్ కానన్ జూ, బొటానికల్ గార్డెన్లను ఈనెల 24, 25 తేదీల్లో మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed