దానా తుఫాన్ ఎఫెక్ట్.. 200 రైలు సర్వీసులు రద్దు

by M.Rajitha |   ( Updated:2024-10-23 12:36:56.0  )
దానా తుఫాన్ ఎఫెక్ట్.. 200 రైలు సర్వీసులు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు, మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా ఆ తర్వాత తుఫానుగా మారింది. కాగా ఐఎండీ ఈ తుఫానుకు "దానా"(Dana) అని నామకరణం చేసింది. దానా తుఫాను గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వలన భీభత్సమైన ఈదురు గాలులు వీస్తుండటం, కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. కాగా దానా తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని రైళ్లను రద్దు చేసింది. ఈనెల 23 నుండి 29 వరకు దాదాపు 200 రైలు సర్వీసులను రద్దు చేయగా.. కొన్నిటిని వేరే రూట్ లో నడుపుతున్నారు. దానా తుఫాను నేపథ్యంలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం 17 నగరాలు, పట్టణాల్లో రైల్వేశాఖ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.





Advertisement

Next Story