'లేదు లేదు.. మావోడు సూసైడ్ చేసుకోలే... ఎవరో చంపేశారు'

by S Gopi |   ( Updated:2023-02-15 11:09:05.0  )
లేదు లేదు.. మావోడు సూసైడ్ చేసుకోలే... ఎవరో చంపేశారు
X

దిశ, వెబ్ డెస్క్: ఐఐటీ ముంబైలో చదువుతున్న స్టూడెంట్ దర్శన్ సోలంకి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విధితమే. అయితే, అతడి మృతిపై కుటుంబ సభ్యులు స్పందిస్తూ, దర్శన్ ఆత్మహత్య చేసుకోలేదు.. అతడిని ఎవరో చంపేశారు అని ఆరోపిస్తున్నారు. అతను ఇంటికి వచ్చినప్పుడు కాలేజీకి సంబంధించి, తోటి స్టూడెంట్స్ బిహేవియర్ గురించి తమతో చర్చించేవాడని, తాను దళిత స్టూడెంట్ అని తెలిసినప్పటి నుంచి తనపై వివక్ష చూపిస్తున్నారని దర్శన్ బాధపడేవాడని, ఈ నేపథ్యంలోనే తమకు అనుమానం ఉందని, దర్శన్ మృతి చేసుకోలేదని... అతడిని ఎవరో హత్య చేశారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, దర్శన్ మృతి విషయంలో లోతుగా విచారణ జరపాలని వారు కోరినట్లు ఓ నేషనల్ చానెల్ లో పేర్కొన్నారు.

Advertisement

Next Story