- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలుడికి దలైలామా క్షమాపణ.. ఆటపట్టించేందుకే అలా చేసినట్లు వ్యాఖ్య
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ బాలుడి పెదాలపై ముద్దుపెట్టడం, తన నాలుకను బాలుడి నోటితో తాకాలని కోరిన టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామా తీరు తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతో దలైలామా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆ బాలుడికి, అతని కుటుంబసభ్యులకు క్షమాపణ తెలియజేశారు.
‘మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది.. అని ఓ బాలుడు దలైలామాను కోరారు. ఆ సమయంలో వారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించే ఉంటే.. అందుకు ఆ బాలుడికి, అతడి కుటుంబానికి దలైలామా క్షమాపణలు తెలియజేస్తున్నారు. తనను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో దలైలామా సరదాగా ఉంటారు. కొన్నిసార్లు వారిని ఆటపట్టిస్తుంటారు. బహిరంగ సభల్లో అయినా, కెమెరాల ముందైనా ఆయన అలాగే ఉంటారు. అయితే జరిగిన దానికి ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు’అని దలైలామా బృందం వెల్లడించింది.