తీవ్ర తుఫానుగా మారిన 'తేజ్' !

by srinivas |
తీవ్ర తుఫానుగా మారిన తేజ్ !
X
  • సోమవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం
  • వాతావరణ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన 'తేజ్' తుఫాను ఆదివారం తీవ్ర తుఫానుగా మారి యెమెన్-ఒమన్ తీరాల వైపు పయనిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 'తేజ్ తుఫాను తీవ్ర స్థాయికి చేరనుంది. అతి వేగంతో వీస్తున్న గాలులు గంటకు గరిష్ఠంగా 62 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్లతో ఉన్నాయి. ఈ ఈదురుగాలులు గంటకు 89 కిలోమీటర్ల నుంచి 117 కిలోమీటర్ల వేగంతో తీవ్ర తుఫానుగా పరిణమిస్తుందని అధికారులు చెప్పారు. దీని ప్రభావం గుజరాత్‌పై ఎక్కువగా ఉంటుందన్నారు. తుఫాను ఆదివారం ఉదయం 8:30 గంటలకు యెమెన్‌కి తూర్పు-ఆగ్నేయంగా 160 కి.మీ.లు, ఒమన్‌కి 540 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా, అల్ గైదాకు ఆగ్నేయంగా 550 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది' అని ఐఎండీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆ తర్వాత మూడు రోజుల్లో ఇది తిరిగి ఉత్తర-ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed