జూలై 19న సీయూఈటీ యూజీ రీటెస్ట్..వెయ్యి మంది అభ్యర్థులకు నిర్వహణ

by vinod kumar |
జూలై 19న సీయూఈటీ యూజీ రీటెస్ట్..వెయ్యి మంది అభ్యర్థులకు నిర్వహణ
X

దిశ, నేషనల్ బ్యూరో: సుమారు వెయ్యి మంది అభ్యర్థులకు జూలై 19న సీయూఈటీ యూజీ పున:పరీక్ష నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి విద్యార్థులు లేవనెత్తిన అనేక ఫిర్యాదులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆదివారం పరీక్ష రీషెడ్యూ్ల్ కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. జూలై 22వ తేదీ నాటికి ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. కాగా, సీయూఈటీ యూజీ తాత్కాలిక సమాధానాల కీ ఈనెల 7వ తేదీన విడుదల చేశారు. ఏవైనా ఫిర్యాదులు అందితే మళ్లి పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది. అయితే పలు కారణాల వల్ల పరీక్ష సమయం కోల్పోవడం, తప్పు భాషల్లో ప్రశ్న పత్రాల పంపిణీ వంటి సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. దీంతో వీటిని పరీశీలనలోకి తీసుకున్న ఎన్టీఏ రీటెస్ట్ నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది.

Advertisement

Next Story