అభిమానం తలకెక్కి..! మోడీ స్టేడియంలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్

by Ramesh N |
అభిమానం తలకెక్కి..! మోడీ స్టేడియంలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ అభిమాన నటుడు, క్రికెటర్ల కోసం కొందరు ఆకతాయిలు వీధి రౌడీల్లా ఒకరినొకరు తలలు పగిలేలా కోట్టుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు తరుచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇటీవల ప్రభాస్ ఫ్యాన్‌ను బెంగళూరులో రక్తం వచ్చేలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చితకబాదిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ ఫ్యాన్స్ కోట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్-ముంబై మ్యాచ్‌లో ఘర్షణ జరిగింది. గ్యాలరీలో ఉన్న ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే ముంబై, గుజరాత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లుగా కొందరు నెటిజన్లు పోస్ట్ చేశారు. మరికొంత మంది ప్రస్తుత ముంబాయి టీమ్ కెప్టెన్ హర్ధిక్ పాండ్యా- రోహిత్ శర్మ ఫ్యాన్స్ కొట్టుకున్నారని వీడియో పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

Next Story