Bombay High Court: నామినేషన్లపై ట్యూటోరియల్స్ పెట్టండి

by Mahesh Kanagandla |
Bombay High Court: నామినేషన్లపై ట్యూటోరియల్స్ పెట్టండి
X

దిశ, నేషనల్ బ్యూరో: నామినేషన్(Nomination) పత్రాలు ఎలా నింపాలో అభ్యర్థులకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల అధికారులు ట్యూటోరియల్(Tutorials) నిర్వహించాలని బాంబే హైకోర్టు(Bombay High Court) ఆదేశించింది. ఈసీ వద్ద ఈ ట్యూటోరియల్స్ ఉండాలని పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇది వరకే బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ తీర్పు ఇచ్చినా.. పిటిషన్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు అవగాహన కల్పించాలని తెలిపింది. రిటర్నింగ్ అధికారికి సర్వహక్కులు ఉండటంపై లేవనెత్తిన అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది. థానే నుంచి ఒకటి, షాపూర్ నుంచి రెండు, చిప్లున్ నుంచి ఒకటి, ముంబయి నుంచి ఒక పిటిషన్ బాంబే హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు విచారిస్తున్నది. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నదని, పిటిషన్లను విచారించాలని కోరగా.. ఎన్నికల షెడ్యూల్ గందరగోళంలో పడుతుందని హైకోర్టు పేర్కొంది. 14 రోజుల సమయం సుదీర్ఘకాలం కాదు.. ఎందుకంటే అభ్యర్థుల పేర్లు పబ్లిష్ చేయాల్సి ఉంటుందని, ఈవీఎంలను నిర్దేశిత పోలింగ్ బూత్‌కు ఈ గడువులోగా తరలించాల్సి ఉంటుందని వివరించింది. పిటిషన్ల అభ్యంతరాలను పరిశీలిస్తామని, కానీ, ఎన్నికల షెడ్యూల్ మార్చే అవకాశమున్న నిర్ణయాన్ని తీసుకోబోమని పేర్కొంది. రిటర్నింగ్ అధికారికి ఎదురులేని అధికారులు ఇవ్వరాదన్న వాదన సరైందేనని పేర్కొంటూ నామినేషన్లు పున:సమీక్షించే అవకాశం కష్టమని, బాహుబలి ఎన్నికల ప్రక్రియను కూడా దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది.

Advertisement

Next Story