బీజేపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. మోడీ ప్రభుత్వానికి ‘ఇండియా’ అంటే వణుకు: CPI నారాయణ ఫైర్

by Satheesh |   ( Updated:2023-09-05 12:35:02.0  )
బీజేపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. మోడీ ప్రభుత్వానికి ‘ఇండియా’ అంటే వణుకు: CPI నారాయణ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మోడీ ప్రభుత్వానికి ఇండియా అనగానే వణుకు పుట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందుకోసమే ఇండియా పేరును భారత్‌గా మార్చాలని చూస్తున్నారని ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా భయపడిపోయి ఇండియా వర్డ్ కనపడకూడదని భారత్‌గా మార్చి రాజ్యాంగ సవరణ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇవ్వన్ని చూస్తుంటే బీజేపీ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందని, అందుకే ఇటీవల వన్ నేషన్, వన్ ఎలక్షన్ తెరపైకి తెచ్చారని, ఇప్పుడు భారత్‌గా పేరు మార్చాలని చూస్తున్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఇండియా కూటమి గెలవడం ఖాయమని, నిరాశతో ఉన్న బీజేపీ కుప్పకూలడం ఖాయమన్నారు.

Advertisement

Next Story