- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మహిళలు నగ్నంగా ఉంటే బాగుంటారా.. రాందేవ్ బాబాను చెప్పుతో కొట్టాలి'
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపుతున్నాయి. మహిళలు నగ్నంగా ఉన్నా అందంగా ఉంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాందేవ్ బాబా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, సీఎం ఏక్ నాథ్ షిండే తనయుడు ఎంపీ శ్రీకాంత్ షిండే, వందలాది మంది మహిళలు పాల్గొన్న కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్రలో నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్‌లో భాగంగా రామ్ దేవ్ బాబా ఈ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ స్పందించారు.
''యోగాను మార్కెటింగ్ చేసే రామ్ దేవ్ బాబా.. మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారు. అతడు అలా మాట్లాడినందుకు అక్కడ ఉన్న మహిళే స్పందించి ఉండాల్సింది. అతడిపై చర్యలు తీసుకొని ఉండాలి లేదా అతడిని చెప్పుతో కొట్టాలి. మహిళలు నగ్నంగా ఉంటే బాగుంటారు అని అన్నాడంటే.. అతడిని మించిన స్త్రీ వ్యతిరేకి ఎవరూ ఉండరు. మహిళా వ్యతిరేక చట్టం కింద అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి.. పతంజలి పేరుతో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాడు" అని రాందేవ్ బాబా తీరును నారాయణ ఖండించారు.