WHO: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్..

by Shamantha N |
WHO: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్..
X

దిశ, నేషనల్ బ్యూరో: కోవిడ్-19 కేసులపై ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. కొన్నివారాలుగా 84 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది. కొవిడ్ ప్రభావం తగ్గిందని విశ్వసిస్తే అది తప్పని.. దీనిపై పునరాలోచన చేయాలని సూచించింది. తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. "కోవిడ్ ఇప్పటికీ మనతోనే ఉంది" అని డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ మరాయ వాన్ ఖెర్ఖోవ్ మీడియాతో అన్నారు. 84 దేశాల నుంచి వచ్చిన డేటా ఆధారంగా కరోనా (SARS-CoV-2) పాజిటివ్ కేసులో పెరిగాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సీజన్ తో సంబంధంలేకుండా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వేసవిలో కరోనా వైరస్ చాలా వరకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ లో కనీసం 40 మంది అథ్లెట్లు కరోనా లేదా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని తెలిపింది.

కొత్త ఇన్ఫెక్షన్లు ఎక్కడ నమోదయ్యాయంటే?

డబ్ల్యూహెచ్ఓ డేటా ప్రకారం అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్‌లో కొత్త ఇన్ఫెక్షన్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్న దానికంటే 2 నుంచి 20 రేట్లు ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రమాదాన్ని తగ్గించగలమని డాక్టర్లు సూచించారు. పదోన్నతి పొందారు. గత 12-18 నెలల్లో వ్యాక్సిన్‌ల లభ్యత గణనీయంగా తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వ్యాక్సిన్‌ల ఉత్పత్తిదారుల సంఖ్య కూడా తగ్గిందని వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ల మార్కెట్ ఉందని.. టీకాల ఉత్పత్తి పెంచాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed