- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చేందుకు బుధవారం ప్రత్యేక కోర్టు నిరాకరించింది. అతను అడ్మిట్ అయిన ఆసుపత్రిలో మెరుగైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. 74 ఏళ్ల నరేశ్ గోయల్ క్యాన్సర్ బారిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇదివరకు ఫిబ్రవరిలో సైతం నరేశ్ గోయల్‌కు మధ్యంతర బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. ఆయనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు అనుమతి కూడా ఇచ్చింది. బుధవారం ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కింద ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే బెయిల్‌ను తిరస్కరించారు. కెనరా బ్యాంకును రూ.538.62 కోట్ల మేర మోసగించిన కేసులో గోయల్, ఆయన భార్య అనితా, కంపెనీకి చెందిన ఇతర అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. 2023, సెప్టెంబర్‌లో ఆయనను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.